Congress: కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తన బాధాకరం : మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ

  • నిరసన తెలియజేసే పద్ధతి హింసాత్మకంగా ఉండకూడదు
  • అసెంబ్లీలో నిన్న జరిగిన నిన్నటి ఘటన రౌడీయిజానికి ప్రతీక
  • ఈ ఘటనను ఖండిస్తున్నాం 

తెలంగాణ అసెంబ్లీలో నిన్న కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తన బాధాకరమని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, నిరసన తెలియజేసే పద్ధతి ఎప్పుడూ హింసాత్మకంగా ఉండకూడదని హితవు పలికారు. అసెంబ్లీలో నిన్న జరిగిన ఘటన రౌడీయిజానికి ప్రతీకని, ఈ ఘటనను తాము ఖండిస్తున్నామని అన్నారు. చేసిన తప్పుకు సిగ్గుపడకుండా తాము చేసిన దాడిని కాంగ్రెస్ సభ్యులు సమర్థించుకోవడం శోచనీయమని అన్నారు. గవర్నర్ పై దాడి చేద్దామనుకున్నామని కాంగ్రెస్ సభ్యులు పేర్కొనడం చాలా దారుణమని అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకోవడం న్యాయమైనదేనని అక్బరుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు.

Congress
mim
Akbaruddin Owaisi
  • Loading...

More Telugu News