dgca: ఎ320 నియో ఇంజన్ విమానాలు సురక్షితం కాదా...? డీజీసీఏ ఎందుకు వాటిని ఆపేసింది?

  • ఇటీవలి కాలంలో తరచుగా ఇంజన్ వైఫల్యాలు
  • రెండు ఇంజన్లు ఉండడంతో గట్టెక్కుతున్న సందర్భాలు
  • అంతర్జాతీయంగా వైఫల్యాలు తక్కువే... మన దగ్గరే ఎక్కువ
  • ప్రయాణికుల భద్రత కోణంలో డీజీసీఏ చర్యలు

ఇండిగో, గో ఎయిర్ కు చెందిన మొత్తం 11 ఎ320 నియో జెట్ విమానాలను వాయు విహారానికి నిరాకరిస్తూ డీజీసీఏ అనుమతులు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇవన్నీ కూడా ప్రాట్ అండ్ విట్నే (పీడబ్ల్యూ) 1100 ట్విన్ ఇంజన్లతో ఉన్న విమానాలు కావడం గమనించాల్సిన అంశం. ఈ విమానాల్లో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఎ320 నియో విమానాలను యూరోప్ కు చెందిన ఎయిర్ బస్ తయారు చేస్తుండగా, వీటిలో అమెరికాకు చెందిన ప్రాట్ అండ్ విట్నే టర్బోఫ్యాన్ ఇంజన్లను వాడుతున్నారు. తరచుగా ఇంజన్ల వైఫల్యాలు తలెత్తుండడమే డీజీసీఏ తాజా నిర్ణయం వెనుక కారణం.

ఇవన్నీ కూడా ట్విన్ ఇంజన్ విమానాలు కావడంతో ఒక ఇంజన్ లో సమస్య వచ్చినా ప్రమాదం లేకుండా మరో ఇంజన్ తో సమస్యను అధిగమిస్తున్నాయి. కానీ, ఆ రెండో ఇంజన్ కూడా విఫలం అయితే ఏంటి పరిస్థితి..? అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందేనా? ఇటీవలి కాలంలో ఇలా ఇంజన్ల వైఫల్యాల ఘటనలు మూడు చోటు చేసుకున్నాయి. టెక్నాలజీ గత మూడు దశాబ్దాల కాలంలో ఎంతో అభివృద్ధి సాధించింది. దీంతో మల్టీ ఇంజన్ ఉన్న విమానాల్లో వైఫల్యాలు ఏటా 25 మాత్రమే చోటు చేసుకుంటున్నాయి. కానీ ఇండిగో సర్వీసుల్లో వారానికొక విమానంలో ఈ వైఫల్యం కనిపిస్తోంది. అందుకే డీజీసీఏ కఠిన చర్యలకు ఉపక్రమించింది.

  • Loading...

More Telugu News