Varma: నాగ్... ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నానంతే: రాంగోపాల్ వర్మ

  • నాగ్, వర్మ కాంబినేషన్ లో ఆఫీసర్
  • పూర్తయిన సినిమా షూటింగ్
  • హైదరాబాద్ వచ్చేసిన నాగ్
  • బాధగా ఉందంటున్న వర్మ

దాదాపు పాతికేళ్ల క్రితం నాగార్జున హీరోగా 'శివ' తీసి టాలీవుడ్ లో ఓ సరికొత్త ట్రెండ్ ను సృష్టించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ, అంతే స్థాయిలో ఉండాలని భావిస్తూ, 'ఆఫీసర్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగా, నాగార్జున ముంబైని వదిలి హైదరాబాద్ చేరిపోయాడు. ఇక గత కొన్ని నెలలుగా నాగ్ తో కలిసున్న వర్మ, ఆయన వెళ్లిన తరువాత తన టీమ్ విచారంలో మునిగిందని, తాను ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నానని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు పెట్టారు. "హే, నాగార్జున, నువ్వు మమ్మల్ని వదిలి హైదరాబాద్ వెళ్లిపోయిన దగ్గర నుంచి నేను, నా ఆఫీసర్ టీమ్ విచారాన్ని పక్కనబెట్టి ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నాం. సార్... మీరు మమ్మల్ని ప్రేమించే దానికంటే మేము మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం" అని వర్మ వ్యాఖ్యానించాడు. వర్మ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Varma
Nagarjuna
Officer
Shooting
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News