prabhas: ప్రభాస్ .. పూజా హెగ్డే మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే!

  • 'సాహో' సినిమాతో బిజీగా ప్రభాస్ 
  • ఆ తరువాత సినిమా కృష్ణంరాజు బ్యానర్లో 
  • జూలై నుంచి షూటింగ్ మొదలు  

ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకున్నాక, కొంత గ్యాప్ ఇచ్చి ప్రభాస్ మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నాడు. కృష్ణంరాజు సొంత బ్యానర్లో రూపొందే ఈ సినిమాకి 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు.

పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమాను, జూలై నుంచి మొదలుపెట్టనున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో ఎన్నో విశేషాలు వుంటాయని చెబుతున్నారు. ఈ సినిమా కూడా భారీ తారాగణంతో .. భారీ బడ్జెట్ తో ఉంటుందని అంటున్నారు. 'సాహో'లో యాక్షన్ హీరోగా విజృంభించే ప్రభాస్, ఆ వెంటనే చేయనున్న సినిమాలో రొమాంటిక్ హీరోగా కనిపించనుండటం విశేషం.   

  • Loading...

More Telugu News