Vivek: వికసించిన ప్రేమ ఒకటిచేస్తే... కార్చిచ్చు విడదీసింది!

  • పర్వతారోహణను ఇష్టపడే ప్రేమజంట వివేక్, దివ్య
  • కురంగిణి కొండపై పర్వతారోహణకు
  • మంటల్లో సజీవ దహనమైన వివేక్
  • ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్న దివ్య

తమిళనాడులోని కురంగణి కొండపై ఏర్పడిన కార్చిచ్చు ఓ ప్రేమ జంటకు జీవితకాల ఎడబాటును తెచ్చిపెట్టింది. ఈ కొండల్లోకి తానెంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య దివ్యతో కలసి ట్రెక్కింగ్ కు వెళ్లిన ఈరోడ్ జిల్లాకు చెందిన వివేక్ (25), మంటల్లో సజీవదహనం కాగా, దివ్య తీవ్రగాయాలతో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది.

పర్వతారోహణను ఎంతో ఇష్టపడే వివేక్, ఓ కొండను ఎక్కుతున్న వేళ, కోయంబత్తూరుకు చెందిన దివ్య పరిచయం కాగా, ఇద్దరూ రెండేళ్లపాటు ప్రేమించుకుని, కొద్దికాలం క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఆపై ఇద్దరూ విహారయాత్రకు వెళ్లారు. కొండపై మంటలు చెలరేగగా, పది మంది మృతిచెందితే, మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో దివ్య కూడా ఉంది.

Vivek
Divya
Kurangini
Fire Accident
  • Loading...

More Telugu News