Chandrababu: సస్పెండ్ చేసినా ఫర్వాలేదు: ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం

  • నిరసనలను కొనసాగించండి
  • నిధుల వివరాలన్నీ ఆన్ లైన్ లో ఉంచాం
  • రాష్ట్రానికి న్యాయం జరగాల్సిందే
  • ఎంపీలతో చంద్రబాబు

పార్లమెంట్ వేదికగా గడచిన వారం రోజులుగా టీడీపీ సభ్యులు చేస్తున్న నిరసనలను కొనసాగించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ ఉదయం ఆయన ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఎంపీలు ఎవరూ నిశబ్ధంగా కూర్చోవద్దని, కలసికట్టుగా రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలిపేలా నిరసనలు చేపట్టాలని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు, రావాల్సిన నిధుల వివరాలతో పాటు యూసీలు, డీపీఆర్ లన్నీ ఆన్ లైన్లో అందుబాటులో ఉంచామని, వాటిని ఎంపీలు వాడుకోవాలని అన్నారు. సభ నుంచి సస్పెండ్ చేసినా ఫర్వాలేదని, బయటకు వచ్చి మరింత ఉద్ధృతంగా పోరాడాలని అన్నారు. ఏ పార్లమెంట్ లో అయితే ఏపీకి అన్యాయం జరిగిందో, అదే పార్లమెంట్ లో రాష్ట్రానికి న్యాయం జరగాల్సిందేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ ఆర్థిక నేరస్తుడని చెబుతూ, ప్రధాని కార్యాలయం చుట్టూ ఆయన తన కేసుల్లో రెండో ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డిని తిప్పిస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News