Wipro: నిత్యమూ తప్పు అంటగట్టే భర్తతో ఉండలేనంటూ తనువు చాలించిన విప్రో ఉద్యోగిని!

  • కర్ణాటకలో ఘటన
  • భార్య ప్రవర్తనను అనుమానించే భర్త
  • ఇద్దరి మధ్యా వాగ్వాదం
  • ఉరేసుకున్న యువతి

నిత్యమూ వివాహేతర బంధం ఉందని అనుమానించి, హింసించే భర్తతో ఉండలేనని భావించిన ఓ యువతి బలవంతంగా తన ప్రాణాలు తీసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బెంగళూరు, భువనేశ్వరి నగర్ లో విజయ్ కిరణ్, తులసి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. తులసి విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నిత్యమూ భార్య ప్రవర్తనను అనుమానించే విజయ్, ఆమెను వేధిస్తుండేవాడు. గతంలో పలుమార్లు వీరిద్దరి మధ్యా గొడవలు జరిగాయి. ఆదివారం కూడా తులసి శీలాన్ని శంకించేలా మాట్లాడటంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె, అదే రోజు రాత్రి తన గదిలోకి వెళ్లి, ఫ్యాన్ కు ఉరేసుకుంది. ఎంత సేపు పిలిచినా పలక్కపోవడంతో ఆమె భర్త విజయ్, తలుపులు బద్దలు కొట్టి ఆమెను కిందకు దించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు విచారణను ప్రారంభించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News