mitchel jhonson: తీవ్రంగా గాయపడిన మిచెల్ జాన్సన్... తలకు 16 కుట్లు

  • జిమ్ లో వ్యాయామం చేస్తూ గాయపడ్డ మిచెల్ జాన్సన్
  • చిన్ అప్ బార్ ఎక్సర్ సైజ్ చేస్తూ తలకు రెండంగుళాల గాయం
  • 16 కుట్లు వేసి, విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు

ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతని తలకు 16 కుట్లు పడడం కోల్ కతా నైట్ రైడర్స్ లో ఆందోళన రేపుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న మిచెల్ జాన్సన్ ఐపీఎల్ లో ఆడుతున్నాడు. జిమ్‌ లో చిన్ అప్ బార్ ఎక్సర్‌ సైజ్‌ చేస్తూ కిందపడ్డాడు. ఆ బార్ అతని తలపై పడడంతో అతని తలకు రెండు అంగుళాల వెడల్పుగా తీవ్రగాయమైంది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా, చికిత్స చేసిన వైద్యులు 16 కుట్లు వేసి, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఐపీఎల్ లో మిచెల్ జాన్సన్ ఆడడం అనుమానంగా మారింది. కాగా, ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మిచెల్ జాన్సన్ ను 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 

mitchel jhonson
Australia
Cricketer
  • Loading...

More Telugu News