sunanda pushkar: సునంద పుష్కర్ కేసులో కొత్త మలుపు.. విష ప్రయోగంతోనే ఆమె మరణించిదన్న వార్తా సంస్థ

  • సునంద పుష్కర్‌ను హత్య చేశారు
  • ఈ విషయం దర్యాప్తు అధికారులకు తొలి నుంచీ తెలుసు
  • ఆ రహస్య నివేదిక మా వద్ద ఉంది
  • డీఎన్ఏ వార్తా సంస్థ సంచలన ప్రకటన

కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. జనవరి 17, 2014న ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో సునంద పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమెపై విష ప్రయోగం జరిగిందని, ఈ విషయం దర్యాప్తు అధికారులకు కూడా తెలుసని డీఎన్ఏ వార్తా సంస్థ సంచలన వార్తా కథనాన్ని ప్రచురించింది. అప్పటి డిప్యూటీ పోలీస్ కమిషనర్ బీఎస్ జైస్వాల్ ఈ కేసులో ప్రాథమిక నివేదిక రూపొందించారని పేర్కొంది. విష ప్రయోగం వల్లే ఆమె మృతి చెందినట్టు జైస్వాల్ నివేదికలో ఉందని వివరించింది.

సునంద శరీరంపై 15 గాయాలున్నాయని, చేతిపై ఉన్న పదో నంబరు గాయం నుంచి ఇంజక్షన్ ఇచ్చారని తెలుస్తోందని జైస్వాల్ రూపొందించిన ప్రాథమిక నివేదికలో ఉందని పేర్కొంది. 12 నంబరు గాయంపై పంటిగాటు ఉందని, అల్ఫ్రాజోలం ప్రయోగం వల్లే ఆమె మృతి చెందినట్టు భావిస్తున్నామని జైస్వాల్ తన నివేదికలో పేర్కొన్నట్టు ‘డీఎన్ఏ’ తెలిపింది. జైస్వాల్ ఈ నివేదికను అప్పటి దక్షిణ ఢిల్లీ రేంజ్ జాయింట్ పోలీస్ కమిషనర్ వివేక్ గోగియాకు ఇచ్చారని, ఆ రహస్య నివేదిక తమ వద్ద ఉందని డీఎన్ఏ పేర్కొని సంచలనం సృష్టించింది.

sunanda pushkar
Shashi Tharoor
Murder
New Delhi
  • Loading...

More Telugu News