nayanatara: నయనతార 'కర్తవ్యం' సినిమా ట్రైలర్‌ విడుదల

  • గతేడాది కోలివుడ్‌లో విడుదలై మంచి విజయం అందుకున్న ‘ఆరమ్’ సినిమా
  • ఈ నెల 16న తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదల
  • కలెక్టర్‌ పాత్రలో నయనతార

గతేడాది కోలివుడ్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘ఆరమ్’ సినిమాను ఈ నెల 16న తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నయనతార కలెక్టర్‌ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్‌ ట్రైలర్ ను ఈ రోజు ఆ సినీ బృందం విడుదల చేసింది. బోరుబావిలో పడిన ఓ చిన్నారిని ఏవిధంగా రక్షించారు? అనే కథతో ఈ సినిమాను రూపొందించారు. ప్రభుత్వం అంటే ప్రజలే అంటే నయనతార చెబుతోన్న డైలాగులు అలరిస్తున్నాయి. దర్శకుడు గోపి నైనర్ ఈ సినిమాను పొలిటికల్ డ్రామాగా రూపొందించారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News