Jana Reddy: మా సభ్యులు మద్యం తాగి సభలోకి రాలేదు: కాంగ్రెస్ నేత జానారెడ్డి

  • టీఆర్‌ఎస్‌ నేతలు అవాస్తవాలు చెబుతున్నారు 
  • ప్రజాస్వామికంగానే మా సభ్యులు సభలో నిరసన తెలిపారు
  • సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల మార్షల్స్‌ దురుసుగా ప్రవర్తించారు

కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజు అసెంబ్లీలోకి మద్యం తాగి వచ్చారని, రౌడీలు, గుండాల్లా ప్రవర్తించారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. వారు చేస్తోన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత జానారెడ్డి స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ సభ్యులపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తమ సభ్యులెవరూ మద్యం తాగి రాలేదని, టీఆర్ఎస్ నేతలు చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.

తాము ప్రజాస్వామికంగానే సభలో నిరసన తెలిపామని, అయినప్పటికీ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పట్ల మార్షల్స్‌ దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. మరో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ..  అసలు మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌కు గాయం కాలేదని, ఆయన సభ నుంచి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ గాయమైనట్టు చెప్పుకున్నారని ఆరోపించారు.

Jana Reddy
Congress
Mallu Bhatti Vikramarka
  • Loading...

More Telugu News