Andhra Pradesh: ఏపీకి పెట్టుబడులు వచ్చింది మోదీ వల్లే : మాణిక్యాలరావు

  • రాష్ట్రానికి  చంద్రబాబు ఎన్ని పెట్టుబడులు తెచ్చారు?
  • ఎన్ని పరిశ్రమలు పెట్టారు? టీడీపీ నేతలు చెప్పాలి
  • ఏపీకి కియా మోటార్స్ వచ్చింది మోదీ వల్లే : మాణిక్యాలరావు

ఏపీకి పెట్టుబడులు వచ్చింది సీఎం చంద్రబాబు వల్ల కాదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్లనేనని బీజేపీ నేత మాణిక్యాలరావు మరోమారు పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పలు విదేశీ పర్యటనలు చేసిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని పరిశ్రమలు పెట్టారో టీడీపీ నేతలు చెప్పాలని ప్రశ్నించారు. ఏపీకి కియా మోటార్స్ వచ్చిందని గొప్పగా చెబుతున్నారని, ఆ సంస్థ ఏపీకి రావడానికి కారణం మోదీయేనని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలనే నినాదంతో ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తుంటే, అది చూసి భయపడ్డ చంద్రబాబు కూడా హోదా నినాదాన్ని ఎత్తుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh
BJP
manikyalarao
  • Loading...

More Telugu News