anup rubens: నేను డిగ్రీకి వచ్చేవరకూ సినిమాలకే వెళ్లలేదు: అనూప్ రూబెన్స్
- చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం
- అందువలన ఆ వైపు దృష్టి పెట్టాను
- సినిమాలు పెద్దగా చూసేవాడిని కాదు
తెలుగులోని పాప్యులర్ సంగీతదర్శకులలో అనూప్ రూబెన్స్ ఒకరుగా కనిపిస్తాడు. మిగతా సంగీత దర్శకులకు భిన్నమైన ట్యూన్స్ ను ఇస్తూ ఆయన తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. అలాంటి అనూప్ రూబెన్స్ .. తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ, తనకెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ముచ్చటించారు.
"నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం. అందువలన చేతిలో ఏదుంటే దాంతో సౌండ్స్ చేస్తూ ఉండేవాడిని. ఆ తరువాత సీరియస్ గా దృష్టి పెట్టి పియానో నేర్చుకున్నాను. పియానో తరువాత మిగతా వాద్య పరికరాలపై పట్టు సాధించాను. సినిమాలవైపు వస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నేను సినిమా చూడటానికి ఎప్పుడూ థియేటర్స్ కి వెళ్లింది లేదు .. టీవీలో వస్తే చూసేవాడిని అంతే. అందుకు కారణం మా కుటుంబ నేపథ్యమే. నేను ఫస్టు టైమ్ థియేటర్ కి వెళ్లింది డిగ్రీ చదువుతోన్న రోజుల్లో" అంటూ చెప్పుకొచ్చాడు.