kaala: రజనీకాంత్ కోసమే కాలాలో నటించాను: నానా పటేకర్

  • విలన్ పాత్ర అనగానే ఆసక్తి లేదని చెప్పాను
  • రజనీకాంత్ స్క్రిప్టు వివరించారు
  • రజనీ మంచితనం వల్లే అంగీకరించాను

వైవిధ్యమైన నటుడిగా బాలీవుడ్ లో పేరుతెచ్చుకున్న నానా పటేకర్ తొలిసారి 'కాలా' సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కేవలం రజనీకాంత్ కోసమే అంగీకరించానని అన్నారు. 'కాలా' సినిమాపై మాట్లాడుతూ, 'కాలా' సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించాలని తనను సంప్రదించారని అన్నారు. దానికి తాను ఆసక్తి చూపలేదని ఆయన చెప్పారు. దీంతో రజనీకాంత్ తనకు స్క్రిప్టు వివరిస్తూ, 'సినిమాలో నన్నెవ్వరూ చూడరు' అని అన్నారని తెలిపారు. అది రజనీ మంచితనమని, కేవలం రజనీకాంత్ కోసమే ఈ సినిమాను అంగీకరించానని ఆయన అన్నారు. పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ధనుష్ సొంత  బ్యానర్ 'వండర్ బార్' పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

kaala
rajani kanth
dhanush
nana patekar
  • Loading...

More Telugu News