jc diwakar reddy: బడి ఎగ్గొడితే ఫెయిలవుతారు...లాబీల్లో కనిపించిన జేసీపై బాబు సెటైర్

  • సీఎంను కలిసేందుకు అసెంబ్లీకి వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి
  • జేసీని అసెంబ్లీ లాబీల్లో కలిసిన సీఎం
  • పార్లమెంటుకు గైర్హాజరవడంపై సెటైర్ వేసిన బాబు

'బడి ఎగ్గొడితే ఫెయిలవుతారు' జాగ్రత్త అంటూ సీఎం చంద్రబాబునాయుడు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై సెటైర్ వేసిన ఆసక్తికర ఘటన అమరావతి అసెంబ్లీ లాబీల్లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీకి చెందిన ఎంపీలంతా ప్రత్యేకహోదా కావాలంటూ పార్లమెంటులో ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, సీఎంను కలిసేందుకు అసెంబ్లీకి వచ్చారు. సీఎంను కలిసేందుకు వెళ్తుండగా, లాబీలో ఆయనే జేసీకి ఎదురయ్యారు. దీంతో ఆయన 'బడి ఎగ్గొడితే ఫెయిలవుతారు' అంటూ సెటైర్ వేశారు. దీంతో నవ్వుతూ ఆయనతో మాట్లాడేందుకు వెళ్లిన జేసీ, ఆయనతో సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తానెప్పుడూ ఫెయిల్ కానని అన్నారు. బడి ఎగ్గొట్టిన వారు, వెనుక బెంచ్‌ లో కూర్చున్న వారు ఉన్నత స్థానాలకి ఎదిగారని ఆయన అన్నారు. 

jc diwakar reddy
Andhra Pradesh
assembly
Chandrababu
  • Loading...

More Telugu News