Lashkar-e-toiba: రెండుగా చీలిన లష్కరే తోయిబా... విడిపోయిన హఫీజ్ సయీద్, అమీర్ హంజా
- వేరు కుంపటి పెట్టుకున్న అమీర్ హంజా
- జైష్ - ఏ- మన్ ఖాఫా పేరిట కొత్త ఉగ్ర సంస్థ
- హఫీజ్ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడంతోనే
పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా రెండుగా చీలిపోయింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన హఫీజ్ సయీద్ పై పాకిస్థాన్ నిషేధం విధించిన నేపథ్యం, ఆ సంస్థకు నిధులను నిలిపివేయడంతోనే లష్కరే తోయిబా విడిపోయినట్టు తెలుస్తోంది. లష్కరే సహ వ్యవస్థాపకుడు మౌలానా అమీర్ హంజా, ఇకపై జైష్ - ఏ- మన్ ఖాఫా పేరిట కొత్త కుంపటి పెట్టుకున్నాడు. హఫీజ్ సయీద్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్న అమీర్ హంజా, ముంబై ఉగ్రదాడి వెనుక సూత్రధారి కూడా. సయీద్ నడిపే జమాతే ఉద్ దవా, ఫలాహ్ ఏ ఇన్సానియత్ నుంచి ఆయనకు నిధులు అందుతున్నాయని తెలుస్తోంది. ఇటీవల హఫీజ్ బ్యాంకు ఖాతాలను పాక్ స్తంభింపజేయడంతో ఉగ్రసంస్థను నిర్వహించేందుకే మరో సంస్థను ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం.