bahubali: టుస్సాడ్ మ్యూజియంలో కట్టప్ప
- కట్టప్ప పాత్రకు అరుదైన గుర్తింపు
- లండన్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో కట్టప్ప
- నిర్ధారించిన శిబిరాజ్
బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రకు దక్కిన గుర్తింపు ఇంకేపాత్రకీ దక్కలేదన్న సంగతి తెలిసిందే. బాహుబలి తొలి భాగం విడుదలైన తరువాత రెండో భాగం విడుదలయ్యేంత వరకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. విశ్వాసానికి కట్టప్ప ను ఉదాహరణగా చూపేంతటి ధీరత్వం కట్టప్ప సొంతం. అంత పాప్యులర్ అయిన ఆ పాత్ర లండన్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో కొలువుదీరనుంది. దీనిని కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ కుమారుడు శిబిరాజ్, కోలీవుడ్ వర్గాలు ధ్రువీకరించారు. దీంతో మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మైనపు విగ్రహం పెట్టించుకోగలిగిన తొలి తమిళ నటుడిగా సత్యరాజ్ నిలవనున్నారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్, రజనీ కాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులకు సాధ్యం కాని గౌరవాన్ని సత్యరాజ్ అందుకోనున్నారు. కాగా, బాహుబలి పాత్రధారి ప్రభాస్ మైనపు విగ్రహాన్ని బ్యాంకాక్ లోని టుస్సాడ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.