Amaravati: అమరావతిలో ఇల్లు ఎందుకంటే..: పవన్ కల్యాణ్

  • నూతన గృహానికి పవన్ శంకుస్థాపన
  • రాజకీయ ప్రయాణంలో కీలక సమయం
  • ప్రజలకు మరింత దగ్గరగా ఉంటాను
  • 14 తరువాత భవిష్యత్ కార్యాచరణ
  • మీడియాతో పవన్ కల్యాణ్

ఈ ఉదయం గుంటూరు జిల్లా కాజాలో తన నూతన గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, కొత్త ఇల్లు కట్టుకోవాలని భావించిన కారణాన్ని మీడియాకు తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో కీలక సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించిన ఆయన, ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రాంతంలో ఇంటి నిర్మాణాన్ని తలపెట్టానని అన్నారు. అమరావతికి దగ్గరగా ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని చెప్పిన పవన్ కల్యాణ్, ఏవైనా తప్పులు జరిగినప్పుడు వెంటనే తన దృష్టికి తీసుకురావాలంటే రాష్ట్ర ప్రజల మధ్య ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. తాను ప్రజల్లోకి వెళ్లాలన్నా, ప్రజలు తన వద్దకు రావాలన్నా ఇక్కడ ఉంటేనే సులభమవుతుందని చెప్పారు. ఈ నెల 14 తరువాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. తన అభిప్రాయాలను ఎన్నడూ దాచుకోబోనని, సమస్యలు ఎదురైతే పారిపోయే మనస్తత్వం తనది కాదని అన్నారు. జనసేన ఆవిర్భావ మహాసభ నాడు తన మనసులోని మాటలను చెబుతానని పవన్ వ్యాఖ్యానించారు.

Amaravati
Pawan Kalyan
Guntur District
kaza
Own House
  • Loading...

More Telugu News