whats app: బ్లూటిక్ పడనీయకుండా వాట్స్ యాప్ మెసేజ్ లు చదివేందుకు మార్గమిది!

  • వాట్స్ యాప్ లో మెసేజ్ చూడగానే ఎదుటి వ్యక్తికి తెలిసేలా బ్లూ టిక్
  • ఏరోప్లేన్ మోడ్ లో ఉంచి చూస్తే బ్లూటిక్స్ పడబోవు
  • ఎదుటివారికి తెలియకుండా మెసేజ్ చూసే చాన్స్

వాట్స్ యాప్ లో ఏదైనా మెసేజ్ వస్తే, దాన్ని చదవగానే, అవతలివారికి తెలిసిపోతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాప్ ను వాడి ఓ మెసేజ్ పంపితే తొలుత గ్రే టిక్, ఆపై మెసేజ్ ఎదుటి వ్యక్తికి చేరితే మరో గ్రే టిక్, అతను చూడగానే ఆ గ్రే టిక్ లు బ్లూ టిక్ గా మారిపోతాయన్న సంగతి తెలిసిందే. ఇక బ్లూ టిక్ పడకుండా మెసేజ్ లు చూడాలంటే ఏం చేయాలో తెలుసా? వాట్స్ యాప్ మెసేజ్ లు చూడాలని అనుకున్న తరువాత నోటిఫికేషన్ ప్యానల్ కు వెళ్లి ఏరోప్లేన్ మోడ్ ను ఆన్ చేస్తే చాలట. ఆపై వాట్స్ యాప్ లోకి వెళ్లి మెసేజ్ లు చదివేసి, తరువాత దాన్ని క్లోజ్ చేయాలి. తిరిగి ఏరోప్లేన్ మోడ్ నుంచి నార్మల్ లోకి ఫోన్ ను మార్చుకుంటే సరిపోతుంది. ఆప్ లైన్లో వాట్స్ యాప్ మెసేజ్ లను చూశారు కాబట్టి, మీరు ఆ మెసేజ్ ని చదివారన్న సంగతి ఎదుటివారికి తెలియదు. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, వాట్స్ యాప్ ను క్లోజ్ చేసిన తరువాత మాత్రమే ఏరోప్లేన్ మోట్ ఆన్ చేయాలి. లేకుంటే బ్యాక్ గ్రౌండ్ లో యాప్ నడుస్తూ, సింక్రనైజ్ అయి బ్లూ టిక్స్ కనిపించే అవకాశాలు ఉన్నాయట.

  • Loading...

More Telugu News