Pawan Kalyan: కాజలో పవన్ కల్యాణ్ కి సొంత ఇల్లు..నేడే భూమి పూజ?

  • రాజధాని ప్రాంతంలో పార్టీ కార్యాలయంతో పాటు స్థిర నివాసం ఉండాలని భావించిన పవన్ కల్యాణ్
  • మంగళగిరి మండలం కాజలో రెండెకరాల స్థలం కొనుగోలు
  • కాజలో కుటుంబ సభ్యుల మధ్య భూమిపూజ

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పర్చుకోనున్నారా? అంటే అవునని తెలుస్తోంది. ఈనెల 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంతో పాటు, సొంత ఇల్లు కూడా రాజధాని ప్రాంతంలో ఉంటే బాగుంటుందని జనసేనాని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి మండలంలోని కాజలో రెండు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. దాని భూమిపూజ నేడు నిర్వహించనున్నారు.

ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే దీని వివరాలు గోప్యంగా ఉంచారు. పవన్ కల్యాణ్ పై అశేషమైన అభిమానం చూపించే అభిమానులు, నేడు భూమిపూజ అన్న సంగతి తెలిస్తే వెల్లువలా వచ్చే అవకాశం ఉందని, వారిని నిలువరించడం కోసం దీనిని గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే భద్రతా కారణాల రీత్యా తన పర్యటన వివరాలను ఆయన డీజీపీకి తెలిపారు. దీంతో పవన్ కల్యాణ్ సొంతిల్లు నిర్మాణం విషయం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ తన కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ చేరుకున్న సంగతి తెలిసిందే. కొనుగోలు చేసిన స్థలంలో నేడు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పవన్ కల్యాణ్ భూమి పూజ చేయనున్నారు. 

Pawan Kalyan
amaravathi
kaja
owen house
  • Loading...

More Telugu News