Andhra Pradesh: జగన్ కు ధైర్యముంటే బీజేపీతో పొత్తుపై మాట్లాడాలి: మంత్రి ప్రత్తిపాటి

  • పొత్తు ఉండబోదని చెప్పగలరా?
  • ఇప్పటికే బీజేపీతో జగన్ లాలూచీ
  • విమర్శించిన ప్రత్తిపాటి పుల్లారావు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండబోదని చెప్పాలని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. ఈ ఉదయం గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీతో పొత్తుపై జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో లాలూచీ పడిన జగన్, ఇప్పటికే లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా వంటి ప్రజా సెంటిమెంట్ తో ముడిపడిన అంశాన్ని రాజకీయం చేస్తోందని, అందుకు ప్రజలే బుద్ధి చెబుతారని ప్రత్తిపాటి హెచ్చరించారు.

Andhra Pradesh
Telugudesam
BJP
Jagan
Pullarao
  • Loading...

More Telugu News