Dinesh Chandimal: శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ.. కెప్టెన్ చండీమల్‌పై నిషేధం!

  • బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్
  • నిర్ణీత సమయానికి నాలుగు ఓవర్లు తక్కువగా వేసిన వైనం
  • మ్యాచ్‌ ఫీజులో 60 శాతం కోత

శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ దినేశ్ చండీమల్‌పై ఐసీసీ రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. దీంతో నేడు భారత్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు చండీమల్ అందుబాటులో లేకుండా పోయాడు. బంగ్లాదేశ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ ఈ నిషేధాన్ని విధించింది. నిర్ణీత సమయానికి నాలుగు ఓవర్లు తక్కువగా వేసినందుకు గాను చండీమల్‌పై వేటు పడగా జట్టు సభ్యులకు మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించినట్టు ఐసీసీ తెలిపింది. అలాగే నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసిన బంగ్లాదేశ్ జట్టుకు కూడా జరిమానా విధించారు. కెప్టెన్ మహ్మదుల్లాకు మ్యాచ్ ఫీజులో 20 శాతం, జట్టు సభ్యులకు 10 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.

Dinesh Chandimal
Sri Lanka
Nidahas Trophy
  • Loading...

More Telugu News