Rahul Dravid: బెంగళూరులో రూ.300 కోట్ల ఘరానా మోసం.. బాధితుల్లో రాహుల్ ద్రవిడ్.. పలువురు సినీ నటులు!

  • స్టాక్ కమోడిటీస్ పేరుతో భారీ ఎత్తున పెట్టుబడుల సేకరణ
  • ఒక్కొక్కరి నుంచి రూ.8  నుంచి రూ.10 కోట్లు
  • కంపెనీ ఎండీ సహా నలుగురి అరెస్ట్

సినీ ప్రముఖులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించి ఆపై నిలువునా ముంచేసిందో కంపెనీ. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన వెలుగుచూసింది. విక్రమ్ ఇన్వెస్టిమెంట్ అనే కంపెనీ నగరంలోని యశ్వంతపుర, బనశంకరి ప్రాంతాల్లో పలువురు ప్రముఖుల నుంచి దాదాపు రూ.300 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో సంస్థ ఎండీ రాఘవేంద్ర శ్రీనాథ్ (39), సూత్ర సురేశ్ (41), నరసింహమూర్తి (44), ప్రహ్లాద్ (47)లను అరెస్ట్ చేసినట్టు దక్షిణ మండలం డీసీపీ శరణప్ప తెలిపారు.

స్పోర్ట్స్ మాజీ రిపోర్టర్ అయిన సూత్ర సురేశ్ కంపెనీ ఎండీ అయిన రాఘవేంద్రతో కలిసి క్రీడాకారులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల ద్వారా స్టాక్‌ కమోడిటీస్ పేరుతో సంస్థలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించారు. ఒక్కొక్కరు రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. బాధితుల్లో టీమిండియా మాజీ క్రికెటర్, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాడ్మింటన్ మాజీ ఆటగాడు ప్రకాశ్ పదుకొనెతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గత అక్టోబరు నుంచి లాభాలు పంచకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News