Uttarakhand: దళిత మహిళలను దూషించి, దాడి చేసిన బీజేపీ ఎమ్మెల్యే... వైరల్ వీడియో

  • ఉత్తరాఖండ్ లోని రుద్రపూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్ కుమార్ తక్రాల్
  • దళిత మహిళలపై దాడిని ఖండించిన రాజ్ కుమార్ తక్రాల్
  • దళిత మహిళలపై దాడికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్

 దళిత మహిళలపై ఇద్దరు బీజేపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే...ఉత్తరాఖండ్ లోని రుద్రపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ కుమార్ తక్రాల్ దళిత మహిళలను కులం పేరుతో దూషించడమే కాకుండా, వారిపై దాడికి తెగబడ్డారు. దీనిపై సదరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అవి పూర్తిగా అసత్య ఆరోపణలని ఆయన కొట్టిపడేశారు. అయితే ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు, ఎమ్మెల్యే రాజ్‌ కుమార్, మరో ఇద్దరు బీజేపీ నేతలపై ఐపీసీ 323, 504 సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Uttarakhand
BJP mla
rajkumar takral
  • Error fetching data: Network response was not ok

More Telugu News