Venkaiah Naidu: భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ విశిష్టమైంది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డుల పురస్కారం
  • సంబంధాల బలోపేతానికి పండగలు దోహదం చేస్తాయి
  • తెలుగువారు ఎక్కడున్నా, పండగలను సమిష్టిగా జరుపుకునేందుకు ఇష్టపడతారు : వెంకయ్యనాయుడు

భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ విశిష్టమైందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు.ఢిల్లీలో తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో 30వ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. మార్గదర్శి గ్రూప్ ఎండీ శైలజా కిరణ్ కు ఉద్యోగ రతన్ అవార్డును, సినీ నటుడు జగపతిబాబు కు, ఉదయ్ శంకర్ అవాస్తికి డీటీఏ జీవన సాఫల్య పురస్కారాలను, సినీ నటి రమ్యకృష్ణ, సంగీత దర్శకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ, డాక్టర్ సుధారాణికి ప్రతిభా భారతి పురస్కారాలను అందజేశారు.  

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు పండగలు దోహదం చేస్తాయని, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డులు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. తెలుగువారు ఎక్కడున్నా, పండగలను సమిష్టిగా జరుపుకోవడానికి ఇష్టపడతారని అన్నారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, ఢిల్లీ తెలుగు అకాడమీకి శాశ్వత భవనం ఏర్పాటు చేయాలని, పిల్లలకు తల్లిదండ్రులు మాతృభాషను నేర్పించాలని, మాతృభాషలో పట్టు సాధిస్తే ఇతర భాషలనూ సులువుగా నేర్చుకోవచ్చని అన్నారు.

  • Loading...

More Telugu News