Chandrababu: అందుకే, సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు: విష్ణుకుమార్ రాజు

  • హోదా విషయంలో జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు
  • అందుకే, చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారు
  • జగన్ కు కొన్ని అంశాల్లో తిరుగులేని మద్దతు వస్తోంది
  • మీడియాతో  బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో వైసీపీ అధినేత జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నందు వల్లే సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం అనంతరం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు కొన్ని అంశాల్లో తిరుగులేని మద్దతు వస్తోందని అన్నారు. కాగా, టీడీపీ విమర్శలు, అనుసరించాల్సిన వ్యూహాలపై, ఎన్డీఏలో టీడీపీ కొనసాగుతూ మైండ్ గేమ్ ఆడుతోందని, ఇటువంటి సమయంలో దూకుడుగా వెళ్లాల్సిందేనని ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం.  

Chandrababu
BJP
vishnukumar raju
  • Loading...

More Telugu News