rakul preet singh: అసభ్యంగా ఎందుకు కామెంట్లు చేస్తున్నారు?: రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన

  • ఫొటో షూట్లు అందరు హీరోయిన్లూ చేస్తున్నారు
  • సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు చేయడం దారుణం
  • నా పరిధులు నాకు తెలుసు

మేగజీన్ల కవర్ పేజీల కోసం హీరోయిన్లు ఫొటో షూట్ చేయడం సాధారణ విషయమేనని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది. అలాంటి ఫొటో షూట్లు తానొక్కదాన్నే చేయడం లేదని... అందరూ చేస్తున్న పనే అని తెలిపింది. ప్రముఖ మేగజీన్ కవర్ పేజీలపై మెరవాలనే కోరిక తనకు కూడా ఉందని... ఇలాంటి ఫొటో షూట్లలో పాల్గొన్నందుకు తనకు కానీ, తన కుటుంబానికి కానీ లేని ఇబ్బంది... మిగతావారికి ఎందుకని అసహనం వ్యక్తం చేసింది. ఫొటోలు నచ్చితే నచ్చాయని చెప్పాలని... లేకపోతే సైలెంట్ గా ఉండాలని చెప్పింది. అంతేకాని, తనపై అసభ్యంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. మితిమీరి గ్లామర్ ను ప్రదర్శించడానికి తాను కూడా వ్యతిరేకమేనని... తన హద్దులను తాను ఎన్నడూ దాటబోనని చెప్పింది. 

rakul preet singh
photo shoot
tollywood
  • Loading...

More Telugu News