Rahul Gandhi: నాన్న చనిపోతాడని ముందే తెలుసు: రాహుల్ గాంధీ

  • తప్పుడు శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తే మరణం తప్పదని వ్యాఖ్య
  • తన తండ్రిని చంపిన వారిని పూర్తిగా క్షమించేశామని వెల్లడి
  • సింగపూర్ లో ఐఐఎం పూర్వ విద్యార్థులతో రాహుల్ భేటీ

‘‘మా నాన్న (రాజీవ్ గాంధీ) చనిపోబోతున్నాడని మాకు ముందే తెలుసు. మా నానమ్మ (ఇందిరా గాంధీ) చనిపోతోందని మాకు ముందే తెలుసు. రాజకీయాల్లో ఉండి దుష్ట శక్తులకు వ్యతిరేకంగా పని చేస్తున్నా.. దేనికోసమైనా గట్టిగా నిలబడినా మరణం తప్పదు. ఇది స్పష్టం..’’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం అక్కడ ఐఐఎం పూర్వ విద్యార్థులతో సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాజీవ్ గాంధీ హత్య తర్వాత చాలా కాలం కోపంగా ఉండేదని.. కానీ తర్వాత వారిని పూర్తిగా క్షమించేశామని పేర్కొన్నారు.

ఎల్ టీటీఈ అధినేత ప్రభాకరన్ చనిపోయినప్పుడు టీవీలో అతడి మృతదేహాన్ని చూశానని, ఆ సమయంలో తనకు రెండు రకాల భావాలు కలిగాయని రాహుల్ గాంధీ చెప్పారు. ‘‘ఒకటేమిటంటే.. వాళ్లు (శ్రీలంక ప్రభుత్వం) ప్రభాకరన్ తో అలా ఎందుకు అవమానకరంగా వ్యవహరించారు అనిపించింది. ఇక ప్రభాకరన్ గురించి, అతని పిల్లల గురించి ఆలోచిస్తే బాధనిపించింది. ఏదైనా హింసాత్మక ఘటన జరిగినప్పడు దాని వెనుక కచ్చితంగా ఓ మనిషి ప్రమేయం ఉంటుంది. ఓ కుటుంబం ఉంటుంది, ఓ చిన్నారి రోదన ఉంటుంది. అలాంటి బాధను నేను కూడా అనుభవించాను. మనుషులను ద్వేషించడం చాలా కష్టం..’’ అని పేర్కొన్నారు.

Rahul Gandhi
Rajiv Gandhi
attack
forgiven
  • Loading...

More Telugu News