moumita saha: ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న టీవీ సీరియల్ నటి

  • ఆత్మహత్యకు పాల్పడ్డ బెంగాలీ నటి మౌమిత
  • ఆమె వయసు 23 ఏళ్లు
  • డిప్రెషన్ వల్లే చనిపోయి ఉండవచ్చన్న పోలీసులు

బెంగాలీ టీవీ సీరియల్ నటి మౌమిత సాహా తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. దక్షిణ కోల్ కతా లోని రీజెంట్ పార్క్ ఏరియాలో ఉన్న తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె వయసు 23 ఏళ్లు.
నిన్న మధ్యాహ్నం నుంచి డోర్ ఓపెన్ చేయకపోవడంతో... ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, అక్కడకు చేరుకున్న పోలీసులు, తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లారు. ఇంటిలోకి వెళ్లిన పోలీసులకు సీలింగ్ కు వేలాడుతున్న మౌమిత మృతదేహం కనిపించింది. రెండు నెలల క్రితమే ఆమె ఆ ఇంటిని రెంట్ కు తీసుకున్నట్టు సమాచారం. ఆ ఇంట్లో ఆమె మాత్రమే ఒంటరిగా ఉంటున్నారు.

ఈ సందర్భంగా ఆమె రాసిన సూసైడ్ నోట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. డిప్రెషన్ వల్లే ఆమె సూసైడ్ చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఆమె సోషల్ మీడియాను పరిశీలించామని... చివరి పోస్ట్ ను పూర్తి డిప్రెషన్ లో పెట్టినట్టు గుర్తించామని చెప్పారు. ఆమె కాల్ లిస్ట్ ను చెక్ చేస్తామని తెలిపారు.

moumita saha
tv actress
kolkata
suicide
  • Loading...

More Telugu News