achennaidu: బాబాయ్ అచ్చెన్నతో విభేదాలు లేవు : ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • మీడియానే ఈ వార్తలను పుట్టించింది
  • మా సన్నిహితులెవరూ ఈ వార్తలను నమ్మరు
  • బాబాయ్ నాకు ఎంతో సహకారం అందిస్తారు

తన బాబాయ్, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో తనకు విభేదాలు ఉన్నాయనే వార్తలను ఎంపీ రామ్మోహన్ నాయుడు ఖండించారు. ఈ పుకార్లను లోకల్ గా మీడియానే పుట్టించిందని ఆయన అన్నారు. టీడీపీ కార్యకర్తలు కానీ, జిల్లా ప్రజలు కానీ, తనకు సన్నిహితంగా ఉన్నవారు కానీ ఈ వార్తలను నమ్మరని చెప్పారు. వాస్తవానికి తన బాబాయ్ తనకు ఎంతో సహకారం అందిస్తారని తెలిపారు. తనను ఎంపీగా వెళ్లమని చెప్పింది బాబాయేనని చెప్పారు. నీవు యువకుడివి, భయపడకుండా నిర్ణయాలు తీసుకోమని బాబాయ్ చెబుతుంటారని అన్నారు. నాన్నగారు ఉన్నప్పుడు జిల్లా నేతలతో బాబాయ్ ఎలా కోఆర్డినేషన్ చేసుకున్నారో... ఇప్పుడు అలాగే తనను లీడ్ తీసుకోమంటూ ఎంకరేజ్ చేస్తుంటారని తెలిపారు. బాబాయ్ తో తనకు విభేదాలు ఉన్నాయనే పుకార్లను నమ్మవద్దని కోరారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు. 

achennaidu
rammohan naidu
disputes
Telugudesam
  • Loading...

More Telugu News