Revanth Reddy: హరీశ్‌ రావు అప్పట్లో పార్టీ మారడానికి ప్రయత్నాలు చేశారు: రేవంత్‌ రెడ్డి

  • గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిశారు
  • బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో కూడా హరీశ్ రావు సమావేశం అయ్యారు
  • ఇవన్నీ వాస్తవాలు కాదా?

ఇతర పార్టీల నేతలు పార్టీలు మారుతున్నారంటూ తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారని, గతంలో సదరు నేత కూడా పార్టీ మారడానికి ప్రయత్నాలు జరిపారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పట్లో పార్టీ మారడానికి హరీశ్‌రావు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిశారని, మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో కూడా హరీశ్ రావు గతంలో సమావేశం అయ్యారని అన్నారు.

ఇవన్నీ వాస్తవాలు కాదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ పౌరసరఫరాల శాఖలో అవినీతిపై విచారణకు ఆదేశించాలని తాము నిరూపించేందుకు సిద్ధమని ఆ శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు ఆయన సవాలు విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు.

Revanth Reddy
Harish Rao
amith shaw
  • Loading...

More Telugu News