harish shankar: ఆ సంస్థ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దర్శకుడు హరీశ్ శంకర్‌ ట్వీట్

  • సర్వీస్ కోసం యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ను సంప్రదించిన దర్శకుడు
  • తమ ఇంటికి వచ్చేందుకు అన్ని వివరాలు ఇచ్చిన హరీశ్ శంకర్
  • అయినప్పటికీ అడ్రస్ కోసం 10 మంది నుంచి ఫోన్‌ కాల్స్

యువ దర్శకుడు హరీశ్ శంకర్ యాక్ట్ ఫైబర్‌నెట్‌ సర్వీస్‌ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. తాను సర్వీస్ కోసం యాక్ట్‌ ఫైబర్‌నెట్‌ డైరెక్టర్‌ను సంప్రదించానని, తమ ఇంటికి వచ్చేందుకు వివరాలు అన్నీ ఇచ్చానని తెలిపారు. వారి వద్ద తన అడ్రస్‌ వివరాలు ఉన్నప్పటికీ ఆ కంపెనీ సిబ్బంది తన అడ్రస్సు తెలుసుకోలేకపోయారని ట్వీట్‌ లో పేర్కొన్నారు. తన అడ్రస్ తెలుసుకోవడం కోసం ఏకంగా 10 మంది నుంచి ఫోన్‌ కాల్స్ వచ్చాయని అన్నారు. పనులన్నీ వదిలేసి వారితో ఫోన్లు మాట్లాడాలా? అని ప్రశ్నించారు.

ఎంతమందితో ఇలా మాట్లాడి వివరాలు చెప్పాలని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, యాక్ట్‌ ఫైబర్‌ నెట్‌లో తాను 40 ఎంబీపీఎస్ ప్లాన్‌లో ఉంటే, 3 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్, 1.25 ఎంబీపీఎస్ అప్‌లోడ్ స్పీడ్ వస్తోందని ఈ రోజు ఉదయం కూడా హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి వచ్చే క్రమంలోనే యాక్ట్‌ ఫైబర్ నెట్ సిబ్బంది ఇలా 10 సార్లు ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది. 

harish shankar
act fibetnet
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News