Mehrin kaur: ఫ్యాన్స్...దయచేసి ఇలా చేయొద్దు...నటి మెహ్రీన్ స్వీట్‌ వార్నింగ్

  • సోషల్ మీడియాలో మెడపై టట్టూ ఉన్న అభిమాని ఫొటో అప్‌లోడ్
  • ఇలాంటి బాధాకరమైన పనులు చేయొద్దని హితవు
  • ఫ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడి

తమ అభిమాన నటీనటులపై ఫ్యాన్స్ చూపించే ప్రేమాభిమానాలకు కొలమానం ఉండదు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో అభిమానులు శృతిమించి తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. అది చివరకు వారికి, వారిని అభిమానించే వారి మనసుకు బాధను కలిగిస్తుంది. తాజాగా టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోన్న మెహ్రీన్ కౌర్ తన అభిమాని చర్యకు తీవ్రంగా మనస్తాపం చెందింది. అతను చేసిన పనికి ఫ్యాన్స్ అందరినీ స్వీట్‌గా హెచ్చరించింది. తన పేరును ఓ అభిమాని అతని మెడపై పచ్చబొట్టు వేయించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది. అభిమానులందరూ తనకు చాలా ఇష్టమని, అందువల్ల ఇలాంటి పనులతో తమను తాము బాధించుకోవద్దని ఆమె స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చింది. ఇలా చెబుతూనే ఇంతలా అభిమానించడంపై ఆమె అశ్చర్యం వ్యక్తం చేసింది. 'ఐ లవ్ యూ ఆల్' అంటూ ఓ పోస్ట్ చేసింది. మరోవైపు ఫ్యాన్స్ వేలంవెర్రి అభిమానాన్ని కొందరు నెటిజన్లు సైతం తీవ్రంగా తప్పు బట్టుతున్నారు.

Mehrin kaur
Fan
Socail media
  • Error fetching data: Network response was not ok

More Telugu News