Narendra Modi: వేదికపై అద్వానీని పట్టించుకోని మోదీ.. వైరల్ వీడియో

  • వేదికపైకి వస్తోన్న సమయంలో తమ పార్టీ నేతలందరికీ నమస్కారం పెట్టిన మోదీ 
  • రెండు చేతులతో అద్వానీ నమస్కారం చేస్తున్నప్పటికీ ప్రతి నమస్కారం చేయని మోదీ
  • నెటిజన్ల విమర్శలు

త్రిపురలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అగర్తలాలోని అసోం రైఫిల్స్‌ మైదానంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విప్లవ్‌ కుమార్‌ దేవ్‌ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టించుకోకుండా అవమానించారని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

మోదీ వేదికపైకి వస్తోన్న సమయంలో తమ పార్టీ నేతలందరికీ నమస్కరించిన నరేంద్ర మోదీ అద్వానీని మాత్రం పట్టించుకోలేదు. రెండు చేతులతో అద్వానీ నమస్కారం చేస్తున్నప్పటికీ మోదీ ప్రతి నమస్కారం చేయకుండా వెళ్లిపోయారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. వేదికపై ఉన్న మిగతా నాయకులందరితో ఆప్యాయంగా మాట్లాడి అద్వానీకి కనీసం నమస్కారం కూడా పెట్టలేదని అంటున్నారు.   

Narendra Modi
adwani
BJP
Tripura
  • Error fetching data: Network response was not ok

More Telugu News