theatres: సర్వీస్‌ ప్రొవైడర్లపై మరో పోరు.. ఈ నెల 16 నుంచి కొత్త సినిమాల విడుదల, షూటింగ్‌లు బంద్‌

  • ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ విరమణ
  • కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న బంద్
  • పోరు మరింత ఉద్ధృతం
  • డిమాండ్లను నెరవేర్చాల్సిందేనని ప్రకటన

అధిక ఛార్జీలు తీసుకుంటోన్న సర్వీస్‌ ప్రొవైడర్ల తీరుకి వ్యతిరేకంగా దక్షిణాదిన సినీ నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే సినిమా థియేటర్లను బంద్ చేసి నిరసన తెలపగా, ఇప్పుడు షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాక కొత్త సినిమాల విడుదలను కూడా నిలిపేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ పోరుని ఈ నెల 16 నుంచి ప్రారంభిస్తామని తమిళ్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) తెలిపింది. క్యూబ్‌, యూఎఫ్‌వోలు ఇక నుంచి వర్చువల్‌ ప్రింట్‌ ఫీజును వసూలు చేయకూడదని,  టికెట్‌ ధరలను నియంత్రణలో ఉంచాలని, ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఛార్జీలను తగ్గించాలని, అన్ని థియేటర్లలో టికెట్లను కంప్యూటరైజ్డ్‌ చేయాలని, చిన్న సినిమాల ప్రదర్శనకు తగిన థియేటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని టీఎఫ్‌పీసీ డిమాండ్ చేసింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ ను విరమించుకోగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం బంద్ యథావిధిగా కొసాగుతూనే ఉంది.  

  • Loading...

More Telugu News