prabhas: 'సాహో' కోసం బరువు తగ్గిన ప్రభాస్

  • సుజీత్ దర్శకత్వంలో 'సాహో '
  • ప్రభాస్ జోడీగా శ్రద్ధా కపూర్ 
  • 'అబుదాబి'లో షూటింగ్ కి సన్నాహాలు    

ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ వారు భారీస్థాయిలో 'సాహో' సినిమాను రూపొందిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. అప్పటివరకూ 'బాహుబలి 2' కోసం బరువు పెరిగిన ప్రభాస్, ఈ సినిమా కోసం బరువు తగ్గవలసి వచ్చింది.

అంతేకాదు ఈ సినిమాలో పాత్ర పరంగా ఆయన మరింత ఫిట్ నెస్ తో కనిపించవలసి వుంది. దాంతో ఆయన నిపుణుల పర్యవేక్షణలో కసరత్తులు చేస్తూ బరువు తగ్గాడు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రభాస్ ఇదివరకటి కన్నా మరింత ఫిట్ నెస్ తో కన్పిస్తూ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల మూడవ వారం నుంచి 'అబుదాబి'లో జరగనుంది.      

prabhas
shraddha kapoor
  • Loading...

More Telugu News