Kodandaram: ప్రొ.కోదండరామ్‌, చాడ వెంకట రెడ్డితో పాటు పలువురి అరెస్టు.. తీవ్ర ఉద్రిక్తత

  • హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ వద్దకు వెళ్లే ప్రయత్నం చేసిన నేతలు
  • కోదండరామ్‌ను బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలింపు
  • పోలీసులు, నేతలకు మధ్య వాగ్వివాదం

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్ ఈ రోజు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ స్ఫూర్తి ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కొందరు ట్యాంక్ బండ్ వద్దకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అరెస్టులు చేశారు. తార్నాకలో ప్రొ.కోదండరామ్ తో పాటు పలువురు టీజేఏసీ కార్యకర్తలు అరెస్టు అయ్యారు.

దీంతో అక్కడ పోలీసులు, కోదండరామ్ కి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కోదండరామ్ ను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు ట్యాంక్ బండ్ కు బయలుదేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి ఆయనను తరలించారు. అరెస్టుల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చెలరేగాయి.  

Kodandaram
Police
arrest
Hyderabad
  • Loading...

More Telugu News