రాజకీయనాయకుడిగా పవర్ఫుల్ పాత్రలో జగ్గూభాయ్
- రవితేజ హీరోగా 'నేల టికెట్'
- కథానాయికగా మాళవిక శర్మ
- రవితేజను ఢీకొట్టే పాత్రలో జగపతిబాబు
హీరోతో సమానమైన ప్రాధాన్యతనిస్తూ ఆయన పాత్రను కల్యాణ్ కృష్ణ అద్భుతంగా తీర్చిదిద్దాడని అంటున్నారు. ఇంతవరకూ జగపతిబాబు చేసిన పాత్రలకు ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. నువ్వా? నేనా? అన్నట్టుగా రవితేజ .. జగపతిబాబు తలపడే సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ జోడీగా మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.