Chandrababu: వైసీపీ నుంచి ఇద్దరు రండి... మంత్రి పదవులు గ్యారెంటీ: టీడీపీ బంపరాఫర్!

  • మూడు స్థానాల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ పావులు
  • మద్దతిస్తే మంత్రి పదవులంటూ ఆఫర్
  • కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలపై వల!

మరో వారంలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో ఎన్నిక జరిగే మూడు స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బహిరంగ బంపరాఫర్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఈ ఉదయం నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మూడు స్థానాల్లో గెలుపొందాలంటే టీడీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేల అవసరం ఉంది. దీంతో పాటు ప్రతి ఒక్కరూ రెండో ప్రాధాన్యతా ఓట్లను సరిగ్గా వేస్తే, ముగ్గురు టీడీపీ అభ్యర్థులు గెలుపొందే అవకాశం లభిస్తుంది.

దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఇద్దరిని ఫిరాయించేలా చూడాలని భావిస్తున్న టీడీపీ నేతలు బేరసారాలు మొదలు పెట్టారన్నది సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారం. ఎవరైనా వైసీపీ నుంచి ఫిరాయించేందుకు ముందు వస్తే వారికి బీజేపీ మంత్రులు కామినేని, పైడికొండల, ఖాళీ చేసిన వైద్య, దేవాదాయ శాఖలు అప్పగించేందుకు సిద్ధమని కూడా టీడీపీ సీనియర్లు సంకేతాలు వదులుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేయాల్సిన టీడీపీ అభ్యర్థులు ఎవరన్న విషయమై కసరత్తు సాగిస్తుండగా, ఈ తరహా వార్తలు వైరల్ అవుతుండటం గమనార్హం.

Chandrababu
Telugudesam
YSRCP
ministers
  • Loading...

More Telugu News