Radhika aapte: బాయ్ ఫ్రెండ్ తో బీచ్ లో రాధికా ఆప్టే... చీర కట్టుకుని తిరుగుతారా? అని అభిమానులపై ఫైర్!

  • గోవా బీచ్ లో సేదదీరిన రాధికా ఆప్టే
  • ఇన్ స్టాగ్రామ్ లో ఫోటో పోస్ట్
  • ట్రాల్ చేసిన నెటిజన్లు
  • ఫైర్ అయిన రాధికా

తెలుగు సినీ ప్రేక్షకులకూ పరిచితురాలైన హీరోయిన్ రాధికా ఆప్టే, తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో గోవా బీచ్ లో సేదదీరుతూ ఆ చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన వేళ, బాడీ షేమింగ్ పై ఆమెను కించపరుస్తున్నట్టు కామెంట్లు వెల్లువెత్తగా, ఆమె సీరియస్ గా స్పందించింది. తనను కించపరిచేవారి కామెంట్లను పట్టించుకోబోనని అంటూ, వాళ్లు మూర్ఖులని, బీచ్ లో సముద్రపు ఒడ్డున చీర కట్టుకుని తిరగాలని వారు అనుకుంటున్నారా? అని నిప్పులు చెరిగింది. తనను విమర్శించే వాళ్లు ఎవరో తనకు తెలియదని, వాళ్ల గురించి పట్టించుకోబోనని చెప్పుకొచ్చింది. కాగా, రాధికపై ఇటువంటి కామెంట్లు రావడం ఇదే మొదటిసారేం కాదు. గతంలోనూ ఆమె పెట్టిన పోస్టులపై నెటిజన్లు విరుచుకుపడ్డారు.

Radhika aapte
Goa Beach
Boy Friend
  • Loading...

More Telugu News