Narendra Modi: ఒక్క ప్రాంతానే పట్టుకుని వేలాడలేను: నరేంద్ర మోదీ

  • పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రజా ప్రతినిధుల సదస్సు
  • సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ
  • అభివృద్ధిలో అన్ని ప్రాంతాలనూ కలుపుకు పోతానని వెల్లడి

సామాజిక అభివృద్ధి అంటే, దేశంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా చూస్తూ సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించడమే తప్ప, ఏదో ఒక్క ప్రాంతాన్ని పట్టుకుని వెళ్లడం కాదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రజల్లో సెంటిమెంట్ ఉందనో లేక, మరేదైనా రాజకీయ కారణాలతో ఓ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూసేది లేదని ఆయన అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఈ ఉదయం జాతీయ ప్రజా ప్రతినిధుల సదస్సు ప్రారంభంకాగా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కొత్త విషయాలను నేర్చుకోవాలని పిలుపునిచ్చిన ఆయన, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమని గుర్తెరగాలని అన్నారు. పోటీతత్వం వల్ల దేశాలు, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఇండియాలో కొన్ని జిల్లాలు అభివృద్ధి పథంలో ఉంటే, మరికొన్ని వెనుకబడి ఉంటాయని, వాటిని గుర్తించి మరింత సాయం చేయడం ద్వారా లోపాలను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుందని వెల్లడించారు. ఈ సదస్సుకు మోదీతో పాటు స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News