Rubix cube: అందరూ తలలు పట్టుకునే రూబిక్స్ పజిల్... క్షణాల్లో చేసి చూపిస్తున్న వీడియో!

  • ఆరు వైపులా తొమ్మిదేసి క్యూబ్ లతో రూబిక్స్
  • మెదడుకు పదును పెట్టే పజిల్
  • 38 సెకన్లలోనే చేసి చూపుతున్న రోబో

రూబిక్స్ క్యూబ్... ఆరు రంగుల్లో తొమ్మిదేసి చొప్పున క్యూబ్ లు ఉండే పజిల్. అన్ని వైపులా ఒకే రంగు ఘనాలు వచ్చేలా చేయడమే ఈ పజిల్. ఇది చేసి చూపించడం చిన్న విషయమేమీ కాదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ రూబిక్స్ ను పట్టుకుని కుస్తీలు పడుతుంటారు. మెదడుకు పదును పెట్టే క్యూబ్ సాల్వింగ్ పై యూఎస్ కు చెందిన ఇద్దరు సైంటిస్టులు కేవలం 38 సెకన్లలో క్యూబ్ ను అమర్చగల రోబో మెషీన్ తయారు చేయించగా, దాని వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదే సమయంలో రూబిక్స్ ను అత్యంత వేగంగా సరిచేయగల ఓ యువకుడు రోబోతో పోటీ పడి ఓడిపోతూ ఉన్న వీడియోను పక్కన చేర్చి తయారు చేసిన ఈ వీడియోను మీరూ చూడండి.

Rubix cube
Robo
Solve
  • Error fetching data: Network response was not ok

More Telugu News