kapil dev: షమీ గురించి నాకు తెలుసు...అలాంటి వాడు కాదు: కపిల్ దేవ్ వత్తాసు

  • హసీన్ జహాన్ ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించింది?
  • భర్తతో సంబంధాలు చెడితే ఇలాగే ఆరోపణలు చేస్తారు
  • షమీ ప్రతిభ గల ఆటగాడు

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీకి ఊహించని మద్దతు దొరికింది. గత వారం రోజులుగా షమీపై రోజుకొక ఆరోపణతో అతని భార్య సంచలన విషయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహ్మద్ షమీ గురించి తనకు తెలుసని, షమీ అలాంటివాడు కాదని దిగ్గజ మాజీ పేసర్ కపిల్ దేవ్ తెలిపారు. ముంబైలో షమీ వివాదంపై ఆయన స్పందిస్తూ, ఆమె ఆరోపణల్లో వాస్తవముంటే...ఇంత ఆలస్యంగా ఎందుకు స్పందించిందని ప్రశ్నించారు.

ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పిన ఆయన, భర్త తమతో మంచిగా ఉంటే ఏమీ మాట్లాడరు, అదే భర్తతో సంబంధాలు చెడితే మాత్రం ఆరోపణలు చేస్తారా? అని నిలదీశారు. షమీ ఎంతో ప్రతిభ గల ఆటగాడని, కష్టపడే మనస్తత్వం ఉన్నవాడని కపిల్ తెలిపాడు. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదైందని, దర్యాప్తులో నిజానిజాలు వెల్లడవుతాయని కపిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. షమీ తప్పు చేసినట్టు రుజువైతే దానిని ఎవరూ ఆమోదించరని కపిల్ తెలిపాడు.

kapil dev
mohammad shami
haseen jahan
  • Loading...

More Telugu News