mohammed shami: నా అకౌంట్ ఎందుకు బ్లాక్ చేశారు? ఫొటోలు ఎందుకు డిలీట్ చేశారు?: ఫేస్ బుక్ పై షమీ భార్య ఫైర్

  • తనకు జరిగిన అన్యాయంపై ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టిన హసీన్
  • అకౌంట్ ను బ్లాక్ చేసిన ఫేస్ బుక్
  • తన అనుమతి లేకుండా ఎలా బ్లాక్ చేస్తారంటూ ఆగ్రహం

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ పై క్రికెటర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన భర్త వల్ల, ఆయన కుటుంబం వల్ల తనకు ఎంతో అన్యాయం జరిగిందని... తనకు ఎవరి నుంచి సహాయసహకారాలు అందలేదని... అందుకే, తన సమస్యలను చెప్పుకోవడానికి ఫేస్ బుక్ ను ఆశ్రయించానని ఆమె తెలిపారు. అయితే, తన అనుమతి లేకుండానే తన అకౌంట్ ను ఎలా బ్లాక్ చేస్తారని, తాను పెట్టిన ఫొటోలను ఎలా డిలీట్ చేస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, హసీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షమీపై హత్యాయత్నం, గృహ హింస కేసు నమోదైంది. మొత్తం 7 సెక్షన్ల కింద కోల్ కత్తా పోలీసులు కేసు నమోదు చేశారు. అతని సోదరుడిపై కూడా అత్యాచారయత్నం కేసు నమోదైంది. 

mohammed shami
hasin jahan
Facebook
account
delete
  • Loading...

More Telugu News