mohammed sharmi: భార్య ఫిర్యాదుతో.. క్రికెటర్ షమీపై హత్యాయత్నం కేసు నమోదు!
- షమీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జహాన్
- ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు
- షమీ అన్నపై అత్యాచారయత్నం కేసు
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీపై హత్యాయత్నం కేసు నమోదైంది. అతని భార్య హసిన్ జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోల్ కత్తా పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసును నమోదు చేశారు. ఫుడ్ పాయిజనింగ్, భౌతికదాడులకు పాల్పడ్డట్టు కేసులో పేర్కొన్నారు. ఇండియన్ పేసర్ పై ఏడు ఛార్జ్ లను నమోదు చేశారు. సెక్షన్లు 498ఏ, 323, 307, 376, 506, 328, 34 కింద కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో షమీ అన్నపై అత్యాచారయత్నం కేసును నమోదు చేశారు.
తన భర్త షమీ, ఆయన కుటుంబసభ్యులు తనను టార్చర్ పెట్టారని, హత్య చేసేందుకు కూడా యత్నించారని, షమీకి ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ... దానికి ఆధారాలుగా వాట్సాప్, ఫేస్ బుక్ మెసెంజర్ లోని స్క్రీన్ షాట్లను జోడిస్తూ సోషల్ మీడియాలో హసిన్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు పలువురు మహిళల ఫొటోలను కూడా అప్ లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో, బీసీసీఐ కాంట్రాక్టును కూడా షమీ కోల్పోయాడు.