parliament: ఏపీ ఎంపీల ఆందోళనల హోరు.. సోమవారానికి లోక్ సభ వాయిదా

  • సేవ్ ఏపీ నినాదాలతో హోరెత్తిన లోక్ సభ
  • సభను నడిపించేందుకు విశ్వయత్నం చేసిన స్పీకర్
  • చివరకు సోమవారానికి వాయిదా

ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఏపీ ఎంపీలు పార్లమెంటు ఉభయసభల్లో తమ నిరసనలను కొనసాగించారు. సేవ్ ఏపీ అని నినాదాలు చేస్తూ, వెల్ లోకి దూసుకెళ్లారు. సభ్యుల ఆందోళనల మధ్యే సభను నడిపించేందుకు లోక్ సభ స్పీకర్ ప్రయత్నించినప్పటికీ, సభ సాగకుండా ఏపీ ఎంపీలు అడ్డుకున్నారు. వాస్తవానికి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం జరిగే ప్రైవేట్ మెంబర్ బిల్లులకు ఎవరూ అంతరాయం కలిగించకూడదు. అయినప్పటికీ, ఏపీకి న్యాయం చేయాల్సిందేనంటూ టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో, ప్రైవేట్ మెంబర్ బిల్లులు కూడా సజావుగా సాగే అవకాశం లేదనే నిర్ణయంతో... సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహాజన్.

parliament
ap mps
protest
  • Loading...

More Telugu News