kapil dev: కోహ్లీకి క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సూచన

  • ఆగస్టులో ఇంగ్లండ్ లో పర్యటించనున్న టీమిండియా
  • పర్యటనకు ముందు కోహ్లీ ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడాలి
  • ఆ అనుభవం కోహ్లీకి ఎంతో ఉపయోగపడుతుంది

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సలహాఇచ్చాడు. త్వరలో ఇంగ్లాండ్‌ పర్యటన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌ మెన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. అయితే ఆగస్టులో ఇంగ్లండ్ లో టీమిండియా ఆడనున్న నేపథ్యంలో ఆ టోర్నీకి ముందే ఇంగ్లండ్ కౌంటీల్లో కోహ్లీ ఆడితే అతడికి, జట్టుకు ఎంతో లాభం చేకూరుతుందని కపిల్ తెలిపాడు.

దిగ్గజ క్రికెటర్లు అలెన్‌ బోర్డర్‌, వివ్‌ రిచర్డ్స్‌, సునీల్‌ గవాస్కర్‌ లు ప్రపంచంలో ఎక్కడైనా, ఎలాంటి పరిస్థితులలోనైనా పరుగులు సాధించి గొప్పవారనిపించుకున్నారని, కోహ్లీ కూడా వారిలా పేరుతెచ్చుకోవాలని కపిల్ ఆకాంక్షించాడు. ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీ మంచి ఆరంభాలిస్తే జట్టుకు ఎంతో మేలు జరుగుతుందని కపిల్ తెలిపాడు. అందుకే కోహ్లీ ఇంగ్లిష్ గడ్డపై కౌంటీ ఆడాలని సూచించాడు. 

kapil dev
Virat Kohli
team india
Cricket
  • Loading...

More Telugu News