mohammad shami: నన్ను చంపి అడవిలో పాతి పెట్టమని షమీ సోదరుడికి చెప్పాడు: హసీన్ జహాన్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-de5bde9dacbbecc8c8d66fa2fadf4fd42ffe7159.jpg)
- రోజుకొక ఆరోపణతో షమీకి షాకిస్తోన్న భార్య హసీన్ జహాన్
- నిన్న ఫిక్సింగ్ ఆరోపణలు
- తాజాగా హతమార్చమన్నాడంటూ ఆరోపణ
టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి ఆయన భార్య హసీన్ జహాన్ రోజుకొక ఆరోపణతో షాకిస్తోంది. పుట్టింట్లో ఉన్న ఆమె తన మెట్టినింటి వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత తన భర్తకు ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని చెప్పి షాక్ ఇచ్చిన హసీన్, తరువాత పాకిస్థాన్ కు చెందిన మహిళ అతనికి డబ్బులిచ్చిందని వెల్లడించింది.
తరువాత కెప్టెన్ కోహ్లీలా షమీ బాలీవుడ్ నటిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడని చెప్పింది. తాజాగా తనను హతమార్చమని తన సోదరుడికి పురమాయించాడని తెలిపింది. హసీన్ వ్యాఖ్యలతో ఇప్పటికే టీమిండియాలో స్థానం కోల్పోయిన షమీ లీగల్ గా అప్రోచ్ అవుతానని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో స్పందించిన హసీన్ జహాన్ ఒకసారి షమీ యూపీలో ఉన్న తన సోదరుడితో తనను చంపి అడవిలో పాతిపెట్టమని చెప్పాడని తెలిపింది.
రెండేళ్లు తనను వేధించాడని చెప్పింది. గత రెండేళ్లుగా విడాకులివ్వమని కోరేవాడని వెల్లడించింది. తనను పెళ్లి చేసుకుని తప్పుచేశానని పలు మార్లు తన ముఖం మీదే అన్నాడని చెప్పింది. తనను షమీ శారీరకంగా, మానసికంగా హింసించాడని పేర్కొంది. తనను ఎక్కడికీ తీసుకెళ్లేవాడు కాదని, ఒకవేళ ఏదైనా ఫంక్షన్ కు కలిసి వెళ్లినా తన భార్యగా తనను ఎవరికీ పరిచయం చేసేవాడు కాదని హసీన్ ఆవేదన వ్యక్తం చేసింది.