Narendra Modi: సుజనా, అశోక్ ల రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి

  • రాజీనామాలను ఆమోదించాలని ప్రధాని సిఫార్సు
  • ఆ వెంటనే సంతకం చేసిన రాష్ట్రపతి
  • ప్రధాని కార్యాలయానికి అందిన సమాచారం

టీడీపీ ఎంపీలుగా ఉన్న కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజుల రాజీనామాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ విషయమై రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రధాని కార్యాలయానికి సమాచారం అందింది. అంతకుముందు ప్రధాని కార్యాలయం నుంచి రాజీనామాలను ఆమోదించాలని కోరుతూ ప్రధాని సంతకం చేసిన లెటర్ రాష్ట్రపతికి చేరింది. ఆపై ఆయన వీటిపై సంతకం చేశారు.

ప్రస్తుతానికి వీరిద్దరి శాఖలూ ప్రధాని వద్దే ఉంటాయని, ఎవరికీ అదనపు బాధ్యతలు ఇవ్వడం లేదని ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కాగా, నిన్న స్వయంగా ప్రధానిని కలిసిన సుజనా, అశోక్ లు తమ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి తాము కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించి, రాజీనామా లేఖలను మోదీకి అందించిన సంగతి తెలిసిందే.

Narendra Modi
Ram Nath Kovind
Sujana Chowdary
Ashok Gajapati Raju
  • Loading...

More Telugu News