tina ambani: ఇదే చివరి ఫొటో అవుతుందనుకోలేదన్న టీనా అంబానీ... బాధపడ్డ బోనీ కపూర్!

  • ఫిబ్రవరి 11న 61వ పుట్టిన రోజు వేడుక నిర్వహించిన టీనా అంబానీ 
  • పుట్టిన రోజు వేడుకకు హాజరైన శ్రీదేవి
  •  నాటి ఫొటోను బోనీకపూర్ కు జ్ఞాపికగా ఇచ్చిన టీనా  

భార్యా వియోగంతో విషాదంలో ఉన్న నిర్మాత బోనీ కపూర్ ను పలువురు బాలీవుడ్, పారిశ్రామిక ప్రముఖులు పరామర్శించి ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బోనీ కపూర్ ను ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ సతీమణి, సినీ నటి టీనా అంబానీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 11న తన 61వ పుట్టినరోజు వేడుక సందర్భంగా సినీ నటి దివంగత శ్రీదేవితో దిగిన ఫోటోకు వెండి ఫ్రేమ్ కట్టించి ఆయనకు జ్ఞాపికగా ఇచ్చారు. ఆ ఫోటోను చూసిన బోనీ కపూర్ ఆనాటి సందర్భాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోను కాగా, ఇదే శ్రీదేవితో కలిసి దిగిన ఆఖరు ఫోటో అవుతుందనుకోలేదని టీనా బాధపడ్డారు. 

tina ambani
bony kapoor
Sridevi
  • Loading...

More Telugu News